రేవంత్‌ది అజ్ఞానమా? అహంకారమా? ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్

by Ramesh Naini |   (  Updated:2026-01-13 15:29:36  IST  )

ట్రాఫిక్ చలాన్లు నేరుగా పోలీసు వాళ్ల అకౌంట్లలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారని, రేవంత్‌రెడ్డిది అజ్ఞానమా? అహంకారమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు.

రేవంత్‌ది అజ్ఞానమా? అహంకారమా? ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ట్రాఫిక్ చలాన్లు నేరుగా పోలీసు వాళ్ల అకౌంట్లలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారని, రేవంత్‌రెడ్డిది అజ్ఞానమా? అహంకారమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి కనీసం రాజ్యాంగ స్ఫూర్తి లేదన్నారు. విచ్చలవిడి అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షలను అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలి ఇచ్చారని పేర్కొన్నారు. చలాన్లు వేసే ముందు రోడ్ల మీద గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి మూర్ఖత్వంగా, చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

ఆయన ఏమైనా రాజు అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ ప్రభుత్వం సొమ్ము పేదలకు ఇవ్వాలని అంటుంటే రేవంత్‌రెడ్డి పేదల డబ్బు దోచుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు అకౌంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం లేదన్నారు. పింఛన్‌దారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆటో క్రెడిట్ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో అనుముల రాజ్యాంగం నడుస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి వాడుతున్న కార్లపైనా చలాన్లు పెండింగులో ఉన్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఉపేంద్రచారి, కురువ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

Next Story