పేర్ని నాని ప్రజాప్రతినిధా లేక వీధిరౌడీనా..? మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-11 11:04:21  IST  )

మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ప్రజాప్రతినిధా లేక వీధిరౌడీనా.. అని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఫైర్ అయ్యారు.

పేర్ని నాని ప్రజాప్రతినిధా లేక వీధిరౌడీనా..? మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ప్రజాప్రతినిధా లేక వీధిరౌడీనా.. అని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం ఆర్‌పేట పీఎస్‌లో పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా పేర్ని నాని అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించడం క్షమించరాని నేరమని అన్నారు. కనీస విచక్షణ, వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా వీధి రౌడీలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు.. పీఎస్‌లోకి అక్రమంగా చొరబడటమే కాకుండా వారిని బెదిరిస్తారా అని ప్రశ్నించారు.

సిగ్గు లేకుండా తనపై తప్పుడు కూతలు కూస్తున్నారని కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. పేర్నినాని విషయంలో తమ వాళ్లను ప్రతిరోజూ కంట్రోల్ చేస్తున్నామని, వాళ్లను గానీ వదిలిపెడితే ఒక్కరు కూడా మిగలరని వార్నింగ్ ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డిదే కీలక పాత్ర అని అన్నారు. జనార్దన్, జయచంద్రారెడ్డి కలిసే కల్తీ మద్యం తయారు చేశారని ఆరోపణలు గుప్పించారు. అందుకే పార్టీ నుంచి కూడా వెంటనే సస్పెండ్ చేశామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎదుటివారు ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పోలీసులను ఏకవచనంతో సంభోధిస్తూ అవమానించిన పేర్ని నానిపై కఠిన చర్యలు తప్పవని కొల్లు రవీంద్ర అన్నారు.

Next Story