- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) నేడు సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీని బీజేపీ(BJP)తో కలపాలని చూస్తున్నారని.. ఆది తనకు ఏమాత్రం ఇష్టం లేదని కవిత రాజకీయ బాంబ్ పేల్చారు. తాను ఉంటే కుదరదని, తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కవిత.. పార్టీలో కేసీఆర్(KCR) నాయకత్వం తప్పా ఎవ్వరి నాయకత్వం తాను ఒప్పుకోబోనని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు(Telangana politics) ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా కవిత మాట్లాడిన మాటలు చూస్తుంటే కవిత ఇక గులాబీ పార్టీలో ఉండటం కష్టమనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ కారు పార్టీ నుంచి బయటికి వస్తే కొత్త పార్టీ పెడతారని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక నిన్నా మొన్నటి దాకా వినిపించిన కాంగ్రెస్ తో పొత్తు అనే విషయంపై కూడా కవిత ఈరోజు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీతో మాట్లాడి పుష్కరకాలం దాటిందన్న ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే.. కాంగ్రెస్ లోనూ చేరకపోవచ్చునని తెలుస్తోంది. ఇక మిగిలింది ఒకేదారి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టడమే. లేదా అదే పార్టీలో ఉంటూ చీలిక తీసుకు రావడం. అయితే రాష్ట్రంలో ఇంత రాజకీయ చర్చ జరుగుతున్నా.. గులాబీ బాస్ కేసీఆర్ గాని, కేటీఆర్, హరీష్ రావు గాని నోరు మెదపక పోవడం గమనార్హం.






