- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్‌బై?
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌కు ఓ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌కు ఓ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy) రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గతకొంత కాలంగా ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇందుకు కారణమని వర్గీయులు చెబుతున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, చైర్ పర్సన్ ఎన్నిక విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇందుకు ఆజ్యం పోతున్నాయి.
ఆయనేం మాట్లాడారంటే?
‘కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా.. భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు, అవమానాలు ఇంకెంత కాలం భరించాలి. ఈ ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు. పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు రాసిచ్చారా?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారు. స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నాడు.. ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలి. జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా వుందో?’ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని స్థానికంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది.






