- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మానేరు ఒడ్డున పుట్టడమే మా పాపమా?’.. ఇసుక దందాతో ప్రజల అవస్థలు
ఇసుక తరలింపుతో మానేరు పరివాహక ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రజాభిప్రాయాలకు భిన్నంగా సాగుతున్న ఇసుక రవాణా ప్రజా జీవనం పై తీవ్ర ప్రభావం చూపుతుండగా గ్రామానికి ప్రజా రవాణాకు అడ్డంకిగా తయారైంది.

దిశ, కరీంనగర్ బ్యూరో : ఇసుక తరలింపుతో మానేరు పరివాహక ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రజాభిప్రాయాలకు భిన్నంగా సాగుతున్న ఇసుక రవాణా ప్రజా జీవనం పై తీవ్ర ప్రభావం చూపుతుండగా గ్రామానికి ప్రజా రవాణాకు అడ్డంకిగా తయారైంది. దీంతో ఆ రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారి జనం మానేరు ఒడ్డున పుట్టడమే మేం చేసిన పాపమా? అని ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు ! ప్రభుత్వాలకు జనం అవస్థలు పట్టవా? అంటూ అధికారం అక్రమ దందాల కోసమేనా? అని పాలకులను ప్రశ్నిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అక్రమదందాల్లో వాటాలు పంచుకుంటూ పట్టించుకోకపోతే ప్రజలు తమ అవస్థలు చెప్పుకునేది ఎవరికి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా రవాణాకు ఇబ్బందిగా దారిపొడవునా లారీలు
మానకొండూర్ మండలంలో చివరి గ్రామం ఊటూర్. మానకొండూర్ నుంచి పచ్చునూర్ వరకు డబుల్ రోడ్డు ఉండగా పచ్చునూర్ నుంచి ఊటూర్ వెళ్లేందుకు మాత్రం సింగల్ రోడ్డు ఎదురుగా భారీ వాహనాలు వస్తే ద్విచక్ర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు తమ వేగాన్ని తగ్గించుకుని నెమ్మదిగా వెళ్లాల్సిందే .అలాంటి పరిస్థితి ఉన్న రోడ్డుపై దారి పొడవునా ఇసుక లారీలు పార్కింగ్ చేయడం తో ఆ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఓ వైపు దారి పొడవునా ఇసుకను తరలించేందుకు వస్తున్న లారీలు పార్క్ చేసి ఉంటుండగా మరో వైపు నుంచి ఇసుకను తరలించే లారీల రవాణా జరుగుతుంది. దీంతో ఆ రోడ్డుపై మరో వాహనం వెళ్లేందుకు అవకాశమే ఉండదు. ఎదురుగా లారీ వస్తున్న విషయం గమనించక ఊటూర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నమే చేస్తే ఇక అంతే సంగతి వెనక్కి వెళ్లలేక ముందుకు సాగలేక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిన దుస్థితి ఆ గ్రామస్తులది.
మానేరు ఒడ్డున పుట్టడమే శాపమా?
ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకునేందుకు గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఇసుక రీచ్ లు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారాయి.ఇసుక రవాణాలో అక్రమార్కుల ఆదాయం పై కన్ను పడిన పాలకులు పైసా ఖర్చులేకుండా సంపదను కొల్లగోడుతుంటే మేం అధికారంలో ఉండి ఏం లాభం అనుకున్న అధికార పార్టీ నేతలు కొందరు నేరుగా అక్రమ దందాను అధికార హోదాలో నిర్వహించడంతో అక్రమ దందాలను అరికట్టాల్సిన అధికారులు అమ్యమ్యాలకు అలవాటుపడి ప్రజల అవస్థలను పట్టించుకోక పోగా భవిష్యత్ ప్రమాదాన్ని సైతం పక్కన పెడుతుండటంతో మానేరు పక్కన పుట్టడమే మేం చేసిన పాపమా అంటూ పాలకుల పై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇదేనా నూతన ఇసుక పాలసీ
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ లతో ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ రీచ్ లో నిల్వ ఉన్న ఇసుకకు బదులుగా మానేరులోనే తవ్వకాలు చేయడంతో పాటు అధిక లోడ్ లు రవాణా చేయడంతో కోట్ల రూపాయల ప్రజా ధనం తో పోసిన రోడ్లు ధ్వంసమవుతూ ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో వ్యవసాయానికి సరిపడా సాగునీరు అందక ఇక్కట్లు తప్పని పరిస్థితి. మరో వైపు లారీల రవాణాతో శబ్ద ,వాయు కాలుష్యం తో ప్రజలకు తప్పని అనారోగ్య పరిస్థితి ఓ వైపు మరో వైపు భవిష్యత్ అనార్థాల పై పట్టించుకోని పాలకులు. ఈ నేపథ్యంలో జనం అసహనంతో రగిలిపోతూ అసౌకర్యాలతో నలిగిపోతున్నారు. దీంతో ఇదేనా ప్రభుత్వం అవలంభిస్తానని చెప్పిన నూతన ఇసుక పాలసీ అంటూ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.






