- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలేపల్లి ఎన్‌హెచ్‌సీ సెంటర్‌లో జీతాల అవకతవకలపై విచారణ
చందంపేట మండలంలోని పోలేపల్లి ఎన్‌హెచ్‌సీ సెంటర్‌లో ఆయా జీతాల చెల్లింపుల్లో అవకతవకలపై శుక్రవారం డీఆర్‌డీఏ డీపీఎం రామలింగయ్య విచారణ నిర్వహించారు.

దిశ, చందంపేట: చందంపేట మండలంలోని పోలేపల్లి ఎన్‌హెచ్‌సీ సెంటర్‌లో ఆయా జీతాల చెల్లింపుల్లో అవకతవకలపై శుక్రవారం డీఆర్‌డీఏ డీపీఎం రామలింగయ్య విచారణ నిర్వహించారు. ఆయా అందుగుల అంజమ్మ తన జీతానికి సంబంధించిన అవకతవకలపై తన కుమారుడు, ఏపీఎం జయప్రసాద్‌పై డీఆర్‌డీఏ పీడీకి ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా డీపీఎం అడిగిన పలు ప్రశ్నలకు ఏపీఎం జయప్రసాద్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేక పోయినట్లు సమాచారం. సెంటర్‌లో అంజమ్మ మాత్రమే పనిచేసినప్పటికీ, మరో వ్యక్తి పేరుతో నాలుగు నెలల పాటు సుమారు రూ.26 వేల జీతం చెల్లించినట్లు రికార్డులు చూపించడం అనుమానాలకు తావిచ్చింది.
అలాగే ఎల్లమ్మ పేరుతో 2001 నుంచి 2026 వరకు పనిచేసినట్లు నమోదు చేసి, రూ.1.76 లక్షల వరకు జీతం చెల్లించినట్లు రికార్డుల్లో చూపడంపై డీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఎల్లమ్మ, ఆమె కుమారుడు శివను విచారించగా, తమకు ఎన్‌హెచ్‌సీ సెంటర్ నుంచి ఎలాంటి జీతం అందలేదని, తాను అక్కడ ఎప్పుడూ పని చేయలేదని ఎల్లమ్మ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక పాఠశాల అవసరాల కోసం కొనుగోలు చేసిన వ్యాన్‌ను ఒక్కరోజు కూడా వినియోగించలేదని, వ్యాన్ కొనుగోలు విషయమే సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేయలేదని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విచారణలో పలు అంశాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు, అందుకు సంబంధించిన పూర్తి విచారణ నివేదికను డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డికి సమర్పించినట్లు డీపీఎం రామలింగయ్య వెల్లడించినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.






