- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SLBC Tunnel : టన్నెల్ వద్ధకు అనుమతిపై వారికో న్యాయం..మాకో న్యాయమా?
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని(SLBC Tunnel Accident) సందర్శించేందుకు బీఆర్ఎస్ బృందాని(BRS Team)కి అనుమతి(Permission) నిరాకరించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government)ఈ రోజు బీజేపీ బృందాని(BJP Tteam)నకి అనుమతించి ద్వంద వైఖరి(Dual attitude)కి చాటుకుందని బీఆర్ఎస్ పార్టీ(Brs Fire) మండిపడింది.

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని(SLBC Tunnel Accident) సందర్శించేందుకు బీఆర్ఎస్ బృందాని(BRS Team)కి అనుమతి(Permission) నిరాకరించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government)ఈ రోజు బీజేపీ బృందాని(BJP Tteam)నకి అనుమతించి ద్వంద వైఖరి(Dual attitude)కి చాటుకుందని బీఆర్ఎస్ పార్టీ(Brs Fire) మండిపడింది.
హరీష్ రావు సారధ్యంలోని బీఆర్ఎస్ నాయకులను, మీడియాను టన్నెల్ లోపలికి అనుమతించని పోలీస్ సిబ్బంది ఈ రోజు బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బృందాన్ని, వారి వెంట మీడియాను ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించారని బీఆర్ఎస్ నాయకులు ఎక్స్ వేదికగా ఎత్తి చూపారు. మోడీ పార్టీ అయితే ఓకే.. కేసీఆర్ పార్టీ అయితే నాట్ ఓకే..నా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టన్నెల్ ప్రమాదంలోనూ కాంగ్రెస్-బీజేపీ దోస్తీ బయటపడిందంటూ ఆరోపించారు.
అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలితే ఎన్డీఎస్ఏ, జ్యూడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేసిన బీజేపీ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై అటువంటి డిమాండ్ చేయడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మరోవైపు ఓ వైపు టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ సాగుతుంటే తరుచు ప్రతిపక్షాలు ప్రమాద పరిశీలన పేరుతో ఆటంకాలు కల్గిస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ మండిపడుతోంది. టన్నెల్ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదంది.






