- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం రద్దు చేయమంటున్న హరీశ్ రావుకు డబుల్ మెంటలా?.. మంత్రి పొంగులేటి కౌంటర్
కేటీఆర్‍ను అరెస్టు చేస్తేనే దీపావళి బాంబులు పడినట్లుకాదని మంత్రి పొంగులేటి అన్నారు. దీపావళి బాంబులు అని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలన్న మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం రద్దు అంటే హరీష్ రావుకు డబుల్ మెంటలా? అని ప్రశ్నించారు. ఈ రెండున్నరేళ్లలో ఏ ఎన్నిక పెట్టినా కాంగ్రెస్ గెలుస్తూ వస్తోందని.. అవి చూసి కూడా హరీష్ రావు పిచ్చి వ్యాఖ్యలు ఎందుకు? అని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో నిర్వహించిన చిట్‍చాట్‍లో మాట్లాడిన మంత్రి.. కేటీఆర్‍కు పిచ్చి పట్టిందని ఎంత వాగినా టైం చూసి మందు వేస్తామన్నారు.
దీపావళి బాంబులపై కట్టుబడి ఉన్నా:
దీపావళి బాంబులపై నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. కేటీఆర్‍ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలినట్లు కాదు ప్రజలు ఛీ కొట్టినా బాంబ్ పడ్డట్లేనన్నారు. మేము వేసిన బాంబులు కేటీఆర్‍కు ఆల్రెడీ తగిలాయన్నారు. ఫారెస్ట్ ఏరియాల్లో ఒకప్పటి థ్రెట్ ఇప్పుడు లేదని అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమర్‍కు భద్రత తగ్గించారని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‍ను కాంగ్రెస్ ఎందుకు చంపే ప్రయత్నం చేస్తామని ఆయనపై ఏమైనా ఉంటే అది బీఆర్ఎస్ వాళ్ళకే ఉంటుందన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు కాంగ్రెస్ చేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు సైతం భద్రత తగ్గించినట్లు వెల్లడించారు. తెలంగాణలో బీజేపీకి అధికారం అనేది దింపుడు కల్లం ఆశ అని కిషన్ రెడ్డి పగటి కలలు కనడం మానేయాలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, కేబినెట్ లిస్ట్ తయారు చేసుకున్నట్లు అనుకుంటున్నారు. రూరల్ - అర్బన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి చూపించిందన్నారు.
వచ్చే ప్రభుత్వంలో సీఎం ఎవరో ఇప్పుడే చెప్పలేం:
ఈ ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. ప్రభుత్వంలో డీసీఎం భట్టి విక్రమార్క నంబర్ -2గా ఉంటారు. నాకున్న మంత్రి పదవితో సంతృప్తిగా ఉన్నానన్నారు. శాఖల మార్పుపై క్లారిటీ లేదని నాకు ఏ శాఖ ఇచ్చినా సంతృప్తిగా ఉంటానన్నారు. వచ్చే ప్రభుత్వంలో సీఎం ఎవరు అనేది ఇప్పుడే చెప్పలేం... కానీ అందరికంటే ముందు నేనే చెప్తానన్నారు. క్యాడర్‍లో అందరూ సంతృప్తిగా ఉండలేరు.. కానీ అందరికీ న్యాయం చేస్తామన్నారు.
ఇందిరమ్మ స్లాప్ విషయంపై..
ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ లెన్త్ పెంపు జీవోపై ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి స్పందించారు. మేస్త్రి లాభం కోసం ఇళ్లకు నాలుగు వైపులా పెంచుతున్నారని స్లాబ్ పెంచడం వల్ల లబ్ధిదారులకే నష్టం అన్నారు. గ్రేటర్ సిటీలో పది అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని రెండు ఎకరాల్లో 8 టవర్లు నిర్మించే ఆలోచనలో ఉందన్నారు. సిటిలో 23 స్థలాలు 18 నియోజకవర్గల్లో వచ్చేలా ఫస్ట్ ఫేజ్ నిర్మాణం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వచ్చే కేబినెట్‍లో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు. నవంబర్ లో GHMC ఎన్నికలు అనే చర్చ ఇప్పటికీ లేదని ఈసారి రైతు భరోసా లిమిట్ లేదని వారంలోపే 9వేల కోట్లు ఇస్తామన్నారు.






