- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: బాపు బాగున్నడా.. అయ్యా! కేటీఆర్‌ను ఆప్యాయంగా పలకరించిన మహిళలు.. వీడియో వైరల్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రజలు మరోసారి గుర్తుచేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral Video) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను ప్రజలు మరోసారి గుర్తుచేస్తున్నారు. ఇటీవల గణేశ్ నిమజ్జన ఉత్సవాలు సందర్భంగా శోభాయాత్రలో కేసీఆర్ పాటలు డీజేలో మార్మొగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను మరోసారి ప్రజలు గుర్తుచేశారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao)తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జడ్చర్లకు బయల్దేరి వెళ్లారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ప్రధమ వర్ధంతి సందర్భంగా నిర్వహించబడుతున్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి హరీశ్ రావు, కేటీఆర్ వెళ్లే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రోడ్డుపై కేటీఆర్‌ను చూసిన చాలా మంది మహిళలు ఆయన వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. బాపు బాగున్నడా.. అయ్యా అంటూ కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు హరీశ్‌రావు, కేటీఆర్‌లతో కలిసి సంతోషంగా ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బాగానే ఉన్నారని నెటిజన్‌లు సెటైర్లు వేశారు. త్వరలో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే బాగుంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్న పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. వీడియో లింక్..
Read More: చెప్పులతో కొట్టుకునే దుస్థితి తెచ్చావు రేవంత్.. హరీశ్‌రావు సెటైరికల్ ట్వీట్






