వేతనాలివ్వండి మహాప్రభో!

by velandi.Saikiran |

నాలుగు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వెంటనే తమ వేతనాలు ఇవ్వాలని నీటి పారుదల శాఖ ఔట్ స

వేతనాలివ్వండి మహాప్రభో!
X

వేతనాలివ్వండి మహాప్రభో!

- జలసౌధ ఎదుట ఇరిగేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

- నాలుగు నెలలుగా జీతాల్లేవని ఆవేదన

- ఇటీవలే రెన్యూవల్ అయినట్లు చెబుతున్న అధికారులు

దిశ, తెలంగాణ బ్యూరో:వేతనాలివ్వండి మహాప్రభో!

వేతనాలివ్వండి మహాప్రభో!

టి అద్దెలు కట్టలేక, పిల్లల ఫీజులు చెల్లించలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగమే అయినా రెగ్యులర్ వారికి మించి డ్యూటీ హవర్స్ చేస్తున్నామని అన్నారు. అయినా.. నెలల తరబడి వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిపడ్డ నాలుగు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు.

సుమారు 250 మంది ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనతో శాఖలోని ఉన్నతాధికారులు తమ వాహనాలకు డ్రైవర్లు లేక స్వయంగా కార్లు నడుపుకుంటూ కార్యాలయానికి వచ్చారు. జలసౌధతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు, కార్యాలయాల్లో సుమారు 2,500 మందికిపైగా ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. గడిచిన నాలుగు నెలలుగా వీరికి వేతనాలు అందడం లేదు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ విషయమై అధికారులు స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు ఇటీవలే రెన్యూవల్ అయిందని తెలిపారు. వారి వేతనాలకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఉందని, సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని చెప్పారు.

Next Story