- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్ గోసాపై 2024లోనే ఫిర్యాదు చేశాం..దిశ కథనాలతో ఇరిగేషన్ అధికారుల్లో కదలిక!
మార్ గోసా రీ వైల్డ్ రిసార్ట్ పై పోలీసులకు 2024లోనే ఫిర్యాదు చేశాం మా తప్పేం లేదని ఇరిగేషన్ డీఈ బాలగణేష్ తెలిపారు. మంజీర నదిమధ్యలో వంతెనలు నిర్మించినట్లు గతేడాది తమ దృష్టికి వచ్చిందన్నారు. బియాస్ నది తరహాలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని

దిశ, సంగారెడ్డి: మార్ గోసా రీ వైల్డ్ రిసార్ట్ పై పోలీసులకు 2024లోనే చేశాం మాదేం తప్పు లేదని ఇరిగేషన్ డీఈ బాలగణేష్ తెలిపారు. మంజీర నదిమధ్యలో వంతెనలు నిర్మించినట్లు గతేడాది తమ దృష్టికి వచ్చిందన్నారు. బియాస్ నది తరహాలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని 2024 జనవరి 25వ తేదీన సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. అప్పటి సంగారెడ్డి తహసీల్దార్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అందులో తమ తప్పు లేదని, అంతా పోలీసులే చూసుకోవాలని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించామని, కూల్చివేయడం తమ డ్యూటీ కాదని రెవెన్యూ, పోలీస్ అధికారులే చూసుకోవాలని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నదులు, వాగులు, వంకలను కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉంటుంది. ఏకంగా మంజీర నది మధ్యలో వంతెనలు నిర్మించి పర్యాటకుల ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా పోలీసులు స్పందించడంలేదు. శాఖల మధ్యన సమన్వయ లోపంతో మార్ గోసా రిసార్ట్ యాజమాన్యం బరితెగించింది. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి ఆన్ లైన్ బుకింగ్ ద్వారా వచ్చే పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇవన్నీ తెలిసినా పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వరుస కథనాలు ప్రచురించిన దిశ దిన పత్రిక..
మంజీర నది మధ్యలో వంతెనలు నిర్మించి పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఈ నెల 26వ తేదీన దిశదినపత్రిక మంజీరాలో రిసార్ట్..మార్ గోసా బరితెగింపు అనే కథనాన్ని ప్రచురించింది. అదే విధంగా ఈ నెల 28వ తేదీ బుధవారం మార్ గోసా.. ఈపేరు వింటేనే అధికారులకు హడల్ అనే కథనాన్ని ప్రచురించింది. దిశ వరుస కథనాలు ప్రచురించడంతో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలతో ఇరిగేషన్ అధికారుల్లో కదలిక వచ్చింది. మార్ గోసా రిసార్ట్ పై 2024లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాం తమదేం తప్పులేదని పోలీసులపై నెపాన్ని నెట్టి జారుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు పట్టించుకోకుంటే ఇరిగేషన్ అధికారులకు సంబంధం ఉండదా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఏడాదిన్నర కాలం అవుతున్నా ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని గౌడిచర్ల గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దిశ దినపత్రిక కథనాలకు కదిలిన ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కు తాము 2024లో ఫిర్యాదు చేసిన కాఫీలు, మార్ గోసా రిసార్ట్ పై నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం ఉందంటూనే ఎందుకు మౌనం వహించారో ఆయా అధికారులకే తెలియాలి.
ఇంటిలిజెన్స్ నివేదిక తయారు..
రిసార్ట్ కు ఎవరెవరి మద్దతు ఉందనే దానిపై ఇంటిలిజెన్స్ అధికారులు నివేదికను తయారు చేశారు. ఇందులో ఇరిగేషన్ అధికారులతో పాటు పోలీసు అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ ఉన్నతాధికారులకు నివేదికను అందించనున్నట్లు సమాచారం. గతంలో బియాస్ నది ప్రవాహంలో 24మంది తెలంగాణ విద్యార్థులుు చనిపోయిన విషయం తెలిసినా నదిమధ్యలో వంతెనలు నిర్మించడానికి సహకరించిన వారెవరు..? ఎందుకు పర్యాటకుల ప్రాణాలతో చెల గాటం ఆడాలనుకున్నారనే విషయాలను ప్రభుత్వానికి అందించనున్నామని ఓ అధికారి తెలిపారు. నది ఆక్రమించడమే తప్పు అందులో వంతెనల నిర్మాణం ఎలా చేస్తారంటూ..వారికి ఎలా సహకరిస్తున్నారని, రిసార్ట్ యాజమాన్యంతో కక్కుర్తి పడి వారికి సహకరించారని తెలిసిందని ఆ అధికారి వివరించారు. ఇప్పటికైనా ప్రమాదకరంగా నది మధ్యలో వంతెనలు నిర్మించిర మార్ గోసా రివైల్డ్ రిసార్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గౌడిచర్ల గ్రామస్తులు కోరుతున్నారు.






