సోషల్ మీడియా మోసాలపై ఉక్కుపాదం.. తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-25 07:23:06  IST  )

రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిన పెట్టేందుకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియా మోసాలపై ఉక్కుపాదం.. తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిన పెట్టేందుకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్ విభాగం నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలకు తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు అలవాటైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వారు ఎలాంటి నేరాలకు పాల్పకుండా వారిపై భారతీయ నేర సంహిత (BNS Act) సెక్షన్-111 ప్రకారం.. సస్పెక్ట్, రౌడీ షీట్స్, హిస్టరీ షీట్స్ తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నిందితుల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల అవాంఛనీయ కార్యకలాపాలను అడ్డుకట్ట పడుతుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు ఉంటాయని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Next Story