- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్ల కలకలం.. డబీర్‌పురా, దారుల్షిఫాలో వెలసిన ఫ్లెక్సీలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Iran Supreme Leader posters) ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో హైదరాబాద్ (Old City hyderabad) పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Khamenei)తో పాటు హిజ్బుల్లా నెంబర్ 2 హసన్ నస్రల్లా ఫోటోలతో ఓల్డ్ సిటీలో ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్‌లోని డబీర్‌పురా, దారుల్షిఫాలో పలు చోట్ల ఇరాన్‌కు మద్దతుగా ఈ పోస్టర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. అంజుమన్-ఎ-మాసూమీన్.. అనే సంస్థ పేరు ఫ్లెక్సీలో ఉంది. ఓవైపు నగరంలో మొహర్రం సందర్భంగా పాతబస్తీలో బీబీకా ఆలం భారీ ర్యాలీ కొనసాగుతోంది. ఈ సమయంలో ఇరాన్ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొహర్రం పర్వదినం సందర్భంగా దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తులో ఉన్నట్లు అధికారుల సమాచారం.
మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్తూ, చార్మినార్, పత్తర్‌గట్టి, మదినా ప్రాంతాల మీదుగా ఊరేగింపు కొనసాగుతోంది. చాదర్‌ఘాట్ వద్ద ర్యాలీ ముగుస్తుంది చార్మినార్ వద్ద బీబీ కా ఆలం (Bibi Ka Alam) చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు చార్మినార్ వద్ద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.






