డీజీపీని కలిసిన ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులు

by Kema Shiva Kumar |

రాష్ట్రానికి కొత్తగా కేటాయించిన ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

డీజీపీని కలిసిన ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి కొత్తగా కేటాయించిన ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 2023 బ్యాచ్‌కు చెందిన మండారే సోహమ్ సునీల్, రాహుల్ కాంత్, ఆయేషా ఫాతిమా, 2024 బ్యాచ్‌కు చెందిన మనీషా నెహ్రా డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో నేరాల పరిస్థితి గురించి డీజీపీ వారికి వివరించారు. త్వరగా తెలుగు భాషతో పాటు తెలంగాణ మాండలికాన్ని కూడా నేర్చుకోవాలని సూచించారు. మహారాష్ట్రకు చెందిన మండారే సోహమ్ సునీల్ కరీంనగర్ కమిషనరేట్‌లో, జార్ఖండ్‌కు చెందిన రాహుల్ కాంత్ ఆదిలాబాద్ జిల్లాలో, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయేషా ఫాతిమా సిద్దిపేట కమిషనరేట్‌లో, రాజస్థాన్‌కు చెందిన మనీషా నెహ్రా ములుగు జిల్లాలో శిక్షణ పొందనున్నారు.

Next Story