కామారెడ్డి: వరదల్లో చిక్కుకున్నాం సార్ అంటూ బాధితుల ఫోన్.. నోరు మూసుకోమంటూ ఐపీఎస్ అధికారి కాల్ కట్

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-29 10:07:39  IST  )

కామారెడ్డిని వరదలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు పొంగి పొర్లుతుండగా.. NH44 నేషనల్ హైవేకి గండి పడింది. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ఓ వైపు రోడ్డుని మూసేశారు అధికారులు. మరోవైపు ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు..

కామారెడ్డి: వరదల్లో చిక్కుకున్నాం సార్ అంటూ బాధితుల ఫోన్.. నోరు మూసుకోమంటూ ఐపీఎస్ అధికారి కాల్ కట్
X

దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డిని వరదలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు పొంగి పొర్లుతుండగా.. NH44 నేషనల్ హైవేకి గండి పడింది. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ఓ వైపు రోడ్డుని మూసేశారు అధికారులు. మరోవైపు ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు.. ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. రెస్క్యూ టీమ్ చేరుకోకపోవడంతో.. సహాయం చేయాలని ఎస్డీఆర్ఎఫ్ చీఫ్ ఐపీఎస్ నాగిరెడ్డికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు బాధితులు. కానీ ఫోన్ ఎత్తిన ఐపీఎస్ అధికారి.. ‘నోరు మూసుకోండి.. మీకేమైనా పిచ్చా.. షట్ అప్’ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యుండి.. ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా అని తిట్టిపోస్తున్నారు జనాలు. ఇంత గౌరవంగా మాట్లాడినా.. అలా పిచ్చా అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు.

VIDEO

Next Story