CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఐఅండ్‌‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌‌

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల (ఐఅండ్‌పీఆర్) శాఖ స్పెషల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని సీహెచ్ ప్రియాంక నియమితులైన విషయం తెలిసిందే.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఐఅండ్‌‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌‌
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల (ఐఅండ్‌పీఆర్) శాఖ స్పెషల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని సీహెచ్ ప్రియాంక (Ch priyanka IAS) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ (సోమవారం) ఆమె బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

(I&PR Special Commissioner) ఐఅండ్‌‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌‌‌గా నియామకం అవ్వడంతో అధికారిని ప్రియాంకకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్ తెలిపారు. కాగా, ప్రియాంక గతంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. తెలంగాణలో ఇటీవల బదిల్లీలో భాగంగా ఆమెను డిప్యూటీ సెక్రటరీ పదవి నుంచి ఐఆండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్ పదవికి ప్రభుత్వం బదిలీ చేసింది.

Next Story