- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025.. బెట్టింగ్ తగ్గిందా ? యూట్యూబర్ అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
ఆన్‌లైన్ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనంగా మారి చాలా మంది ఆర్థికంగా నష్టపోవడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం వరకు తెచ్చుకున్న ఘటనలు చూశాము.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్ గేమ్స్ (Online games), ఐపీఎల్ బెట్టింగ్ (IPL betting) వ్యసనంగా మారి చాలా మంది ఆర్థికంగా నష్టపోవడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం వరకు తెచ్చుకున్న ఘటనలు చూశాము. ఇక ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్ కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. (Today Match Predictions) ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరుతో కోట్లలో బెట్టింగ్ దందా సాగేది. ఈ బెట్టింగ్ మాయలో పడి యువత జీవితాలు ఆగం అవుతున్నాయని గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌పై విపరీతంగ చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పకడ్భందిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో, ఈ సారి ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ చాలా వరకు తగ్గిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (naa anveshana) ఒక వీడియో విడుదల చేశారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో విపరీతంగా బెట్టింగ్ జరగాలి.. కానీ ఈ సారి జరగలేదని అన్వేష్ అన్నారు. పోయిన సారి బెట్టింగ్ జరిగిందని, కానీ ఎందుకు జరగడం లేదు? అని ప్రశ్నించారు. బెట్టింగ్‌కు వ్యతిరేకంగా సీఎంలు, పోలీసులు, అధికారులు, ప్రజలు రంగంలోకి దిగడం వల్లే వీటిని నియంత్రించామని స్పష్టం చేశారు. తనను ఎంత మంది విమర్శించిన బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా అవగాహాన కల్పించే వీడియోలు చేస్తూనే ఉంటానని అన్వేష్ చెప్పుకొచ్చారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నగరంలోని పంజాగుట్ట, మియాపూర్ సహా రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను సిట్ సమీక్షిస్తుంది. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టాలివుడ్ నటులపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు కేసులు నమోదైన విషయం తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది.






