KTR : BRS పాలనలో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు : కేటీఆర్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-30 13:37:13  IST  )

బీఆర్ఎస్(BRS) పాలనలో తెలంగాణకు రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు.

KTR : BRS పాలనలో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) పాలనలో తెలంగాణకు రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు. లండన్(London) లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్-2025 సదస్సు(Bridge India Week 2025 Conference)లో నేడు కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014-2023 మధ్య బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి రూ. 3.5 లక్షలకు పైగా పెట్టుబడులు(Investiments) తీసుకు వచ్చామని వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలతో 10 లక్షలమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని అన్నారు. ఐటీ ఎగుమతులు రూ. 57,258 కోట్ల నుంచి రూ. 2.41 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు.

హైదరాబాద్(Hyderabad) బెంగళూరును అధిగమించి టెక్నాలజీ ఉద్యోగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపామని పేర్కొన్నారు. తమ పాలనలో తీసుకువచ్చిన TSiPASS పారిశ్రామిక విధానం, ఎలక్ట్రిక్ వాహన విధానం(EV Policy), తెలంగాణ మొబిలిటీ వ్యాలీ వంటి విధానాల ద్వారా ఈ ఘనత సాధ్యం అయిందని తెలిపిన కేటీఆర్.. ప్రపంచంలోనే టాప్ 5 MNC కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలు తెలంగాణలో తమ అతిపెద్ద క్యాంపస్ లు నెలకొల్పాయని తెలియజేశారు. ఈ సదస్సు భారత్-యూకే వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో తెలంగాణ పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story