బీసీ కులాల తొలగింపుపై విచారణ

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బీసీ కులాల జాబితా నుండి తొలగించిన 26 కులాలపై బీసీ కమిషన్​ విచారించింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల నుంచి కొన్ని కులాల తొలగింపు విషయంలో

బీసీ కులాల తొలగింపుపై విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బీసీ కులాల జాబితా నుండి తొలగించిన 26 కులాలపై బీసీ కమిషన్​ విచారించింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల నుంచి కొన్ని కులాల తొలగింపు విషయంలో బుధవారం తెలంగాణ బీసీ కమిషన్‌లో ఉదయం 11 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ విచారణ నిర్వహించారు. ఇందులో బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి. నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాష్‌, బాలలక్ష్మి రంగు, డిప్యూటి డైరెక్టర్‌ యు. శ్రీనివాసరావు, స్పెషల్‌ ఆఫీసర్‌ జి. సతీష్‌ కుమార్‌, రీసెర్చ్‌ ఆఫీసర్‌ జి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 64 ప్రతినిధుల బృందాలను కమిషన్‌ విచారించడం జరిగింది. మొత్తంగా మూడు రోజుల విచారణలో 133 బృందాలను కమిషన్‌ విచారణ చేయడం జరిగింది. పొందర, శెట్టిబలిజ, కొప్పుల వెలమ, పొలినాటి వెలమ, కళింగ కులానికి చెందిన వారు కమిషన్‌ ముందు హాజరై తమ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆమదాలవలస నియోజకవర్గం ఎంఎల్‌ఏ కూన రవికుమార్‌ కళింగ కులం తరపున మాట్లాడారు. మరోవైపు తెలంగాణ బిసి`ఎ గ్రూపునకు చెందిన పలు కులాల ప్రతినిధులు తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవద్దని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story