- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: సిగాచీ ఘటనలో ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించలేదా? హైకోర్టు సీరియస్
సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఈ ఏడాది జూన్ 30న సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో (Sigachi Industry Explosion Incident) పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు (TG High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుడు సాధారణ ఘటన కాదని 54 మంది చనిపోయారని సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. ఈ ఘటనపై దాఖలైన పిల్‍పై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతుండటంపై ఏఏజీని సీజే ప్రశ్నించారు. 237 మంది సాక్షులను విచారించినా దర్యాప్తులో పురోగతి లేదా? పేలుడు ఘటనకు ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించలేదా? అని ప్రశ్నించారు. పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారా అని నిలదీసింది. పోలీసుల దర్యాప్తు నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజురకావాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.






