- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూడు రంగాల్లో పెట్టుబడులు పెట్టండి.. జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్‌తో సీఎం రేవంత్
పెట్టుబడుల విషయంలో తెలంగాణ (Telangana) జర్మనీ (Germany) భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

దిశ వెబ్‌డెస్క్: పెట్టుబడుల విషయంలో తెలంగాణ (Telangana) జర్మనీ (Germany) భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలు తమ వద్ద పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ (Michael Hosper) బృందంతో భేటీ అయ్యారు. డాయిచ్ బోర్సే (Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఇవాళ తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభిస్తున్నట్లు సీఎంకు జర్మనీ బృందం తెలిపింది. GCC ఏర్పాటుకు గాను తమ సిటీని ఎంచుకున్నందుకు సీఎం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రపంచ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు రావాలని.. అందుకు వారికి ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతును ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో నెలకొల్పబోయే డాయిచ్ బోర్సే (Deutsche Borse) కంపెనీ GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోందని అన్నారు. ఇక హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని సీఎం కోరారు. నగరంలో జర్మన్ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా TOMCOM ద్వారా వోకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని విన్నవించారు. ఈ భేటీలో అమితా దేశాయ్, డాయిచ్ బోర్సే CIO, COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read More... సుక్మా అడవుల్లో సంచలనం.. మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం






