- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jupally Krishna Rao : తెలంగాణ పర్యటకంలో పెట్టుబడులు పెట్టండి : ఇన్వెస్టర్లకు మంత్రి జూపల్లి పిలుపు
తెలంగాణ పర్యాటక రంగం(Telangana Tourism)లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) దక్షిణాసియా ఇన్వెస్టర్ల(South Asian Investors)కు పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పర్యాటక రంగం(Telangana Tourism)లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) దక్షిణాసియా ఇన్వెస్టర్ల(South Asian Investors)కు పిలుపునిచ్చారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ పర్యటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ నూతన పర్యాటక విధానంతో తెలంగాణ ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికొచ్చే పెట్టుబడిదారులకు మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ప్రకటించారు.
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా తెలంగాణను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, హెరిటేజ్, మెడికల్, వెల్‌నెస్ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా నూతన పర్యాటక విధానాన్ని(New Tourism Policy) రూపొందించాని వివరించారు. రాష్ట్రంలో 2030 నాటికి రూ.15 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలనే ఆశయంతో పని చేస్తున్నామని మంత్రి జూపల్లి తెలియజేశారు.






