- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: పరస్పరం కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
కాంగ్రెస్ పార్టీలో నేతలు పిడిగుద్దులతో రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ (Congress) పార్టీలో నేతలు పరస్పరం కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) నేతలు కొట్టుకున్నారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్ టీయూసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల మధ్య రసాభాసా చోటు చేసుకుంది. సంజీవ రెడ్డి (sanjeeva reddy) వర్సెస్ అంబటి కృష్ణమూర్తి (Ambati Krishnamurthy) వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పిడిగుద్దులతో కొట్టుకున్నారు. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవ రెడ్డి అనుచరులు అడ్డుకుని అంబటిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పిడిగుద్దుల వరకు వచ్చింది. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఆబిడ్స్ పోలీసులు సంజీవరెడ్డి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






