సింగరేణిలో కార్మికులకు లాభాల వాటా పంచాలి..సీఎండి బలరాంకు జనక్​ప్రసాద్​లేఖ

by Ajay Maddhiboyina |

సింగరేణి కార్మికుల లాభాల వాటా, బదిలీ వర్కర్ల ప్రమోషన్, నూతన ట్రాన్స్ఫర్​ పాలసీ రద్దు, మెడికల్ బోర్డు పునరుద్ధరణ వంటి అంశాలపై సింగరేణి

సింగరేణిలో కార్మికులకు లాభాల వాటా పంచాలి..సీఎండి బలరాంకు జనక్​ప్రసాద్​లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కార్మికుల లాభాల వాటా, బదిలీ వర్కర్ల ప్రమోషన్, నూతన ట్రాన్స్ఫర్​ పాలసీ రద్దు, మెడికల్ బోర్డు పునరుద్ధరణ వంటి అంశాలపై సింగరేణి సీఎండీ ఎన్​. బలరాం కు కనీస వేతన సలహా మండలి ఛైర్మన్​, ఐఎన్​టియూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మంగళవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎండీని కలిసి అభినందనలు తెలిపి ఈ లేఖను అందజేశారు. సింగరేణి కాలరీస్ సంస్థ ప్రగతికి కార్మికులు పునాదులుగా నిలుస్తున్నారని, 2024 -25 ఆర్థిక సంవత్సరంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, సింగరేణి ఉద్యోగులు 72 మిలియన్ టన్నుల లక్ష్యానికి గానూ 69.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి, 96 శాతం టార్గెట్‌ను చేరుకుని రికార్డు స్థాయి డిస్పాచ్‌ను నమోదుచేశారన్నారు. ఈ విజయానికి కార్మికుల కృషి నే ప్రధాన కారణమని వారి శ్రమకి తగిన గుర్తింపు రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల తక్షణ ప్రకటన చేయాలని . అలాగే 35 శాతం లాభాల్లో భాగస్వామ్య వాటా ను కార్మికులకు ప్రకటించి, చెల్లించే తేదీని ఖరారు చేయాలని సూచించారు. బదిలీ వర్కర్లు 240 పని దినాల (మస్టర్ల)కు గాను 190 పనిదినాలు పూర్తి చేసినవారికి జనరల్ అసిస్టెంట్ పదోన్నతులు వెంటనే ఇవ్వాలని కోరారు. 2025 మే నెల 12న విడుదలైన ఎన్​సీడబ్ల్యూఏ బదిలీ పాలసీని రద్దు చేయాలని , ఈ విధానాన్ని యూనియన్లతో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు సమావేశాన్ని గతంలో మాదిరిగా నెలకు ఒకసారి నిర్వహించాలని, కార్మికుల యూనిఫాంలకు అవసరమైన నాణ్యమైన మెటీరియల్, స్టిచింగ్ ఖర్చులను, కోల్ ఇండియా తరహాలో అందించాలని , ఈ అంశాలన్నింటిపై సాగుకూలంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని జనక్ ప్రసాద్ కోరారు.

సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ కు విశ్వగురు వ‌ర‌ల్డ్ రికార్డు

చెట్లు నాటడంలో సింగ‌రేణి సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ కు అరుదైన గుర్తింపు లభించింది. గత కొద్ది రోజుల నుండి తానొక్కడే ఇప్పటి వరకు సుమారుగా 20 వేల మొక్కలను నాటడం ద్వారా అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. ప‌ర్యావ‌ర‌ణానికి ఆయ‌న చేసిన కృషికి గుర్తింపుగా విశ్వగురు వ‌ర‌ల్డ్ రికార్డులో ఆయనకు చోటు లభించింది. సోమవారం నాడు కూడా సింగరేణి కొత్తగూడెం జీకే ఓసీ ఉప‌రిత‌ల గ‌ని డంప్‌పై 225వ మొక్కలు నాటగా, నిన్న మంగళవారం కూడా కొత్తగూడెం జీకే ఓసీ డంప్‌పై 230 మొక్కలు నాటి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ కు విశ్వగురు వ‌ర‌ల్డ్ రికార్డు ప‌త్రాన్ని, మెమెంటో ను ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. గత ఆరేళ్లుగా సింగ‌రేణిలో 35 కు పైగా చిట్టడవులను సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ సృష్టించారని పేర్కొన్నారు. దేశంలో 20 వేల మొక్కలు నాటిన మొద‌టి సివిల్ స‌ర్వీసెస్ అధికారిగా ను బలరాంకు రికార్డు ఉందన్నారు. తాను నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయించ‌డం విశేషం.

Next Story