- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: నవీన్ యాదవ్‌ను పరిచయం చేశా.. ఖర్గేతో భేటీపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం వారి బృందం కీలక ఏఐసీసీ నేతలను కలిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం వారి బృందం కీలక ఏఐసీసీ నేతలను కలిసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిశాం. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన నవీన్ యాదవ్‌ను పరిచయం చేశాను. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.’ అని తెలిపారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి టీమ్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఈ సందర్భంగా రాహుల్ శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కష్టపడిన నాయకులను అభినందించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విజయం గురించి రాష్ట్ర నేతలు రాహుల్‌కు వివరించారు. ట్వీట్ ఇదే..






