మానవత్వాన్ని బలిపెట్టొద్దు.. డబ్బు మత్తులో.. బంధాలు చిద్రం! సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్

by Ramesh Naini |

కరీంనగర్ జిల్లా రామడుగులో రూ. 4 కోట్లకు బీమా చేయించి అన్నను ఘోరంగా హతమార్చాడు.

మానవత్వాన్ని బలిపెట్టొద్దు.. డబ్బు మత్తులో.. బంధాలు చిద్రం! సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లా రామడుగులో రూ. 4 కోట్లకు బీమా చేయించి అన్నను ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బీమా సంస్థ ప్రతినిధులకు అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బుధవారం ఎక్స్ వేదికగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. డబ్బు మత్తులో.. బంధాలు చిద్రం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

‘బీమా డబ్బుల కోసం తోడబుట్టినవాడినే కడతేర్చిన ఈ ఘటన, మన సమాజం ఎటు పోతోందో చెప్పకనే చెబుతోంది. పేగుబంధం కంటే పైసలే ఎక్కువనుకోవడం అత్యంత దురదృష్టకరం. గుర్తుంచుకోండి.. కష్టమొస్తే నోట్లు కన్నీళ్లు తుడవవు. ఆస్తులు ఆలింగనం చేసుకోవు. సిరి సంపదలు వస్తాయి.. పోతాయి, కానీ తోడబుట్టిన వాడు, కన్నవారు, కష్టంలో నిలిచే స్నేహితుడు.. ఇవే నిజమైన ఆస్తులు. అవి మనతోనే ఉంటాయి. ఏ బ్యాంక్ బ్యాలెన్స్ గుండె చప్పుడును కొనలేదు. ఏ బీమా పాలసీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేదు. దురాశ కోరల్లో చిక్కుకుని మానవత్వాన్ని బలి పెట్టొద్దు. డబ్బు శాశ్వతం కాదు.. మనిషి, మమకారాలే ముఖ్యం’ అని సజ్జనార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story