అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

by Elthuri vijay kumar |

అంతరాష్ట్ర ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన ఐదు షైన్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టుగా నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు.

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
X

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ఐదు బైకులు స్వాధీనం, కేసు నమోదు

దిశ,మక్తల్ : అంతరాష్ట్ర ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన ఐదు షైన్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టుగా నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు. శుక్రవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎన్.లింగయ్య మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తి ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా కర్ణాటకకు చెందిన దుర్గప్ప, ఎల్లప్ప ముఠాగా ఏర్పడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బైకులు దొంగతనం చేసి రాయచూర్ లో బైక్ మెకానిక్ గా ఉన్న శంషోద్దీన్ కు అప్పగించగా ఆయన వీటిని అమ్మి పెట్టేవాడని తమ ఎంక్వయిరీలో తెలిందని డీఎస్పీ తెలిపారు . ఈ సెర్చ్ ఆపరేషన్ లో పనిచేసిన అశోక్.నరేష్. శశి.శ్రీకాంత్ కానిస్టేబుల్స్ ను అభినందించారు. కార్యక్రమంలో సీఐ రామలాల్, మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.

Next Story