- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
No Internet: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం!
తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : (Telangana Secretariat) తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం (Internet services disrupted) ఏర్పడింది. గత ఐదు రోజులుగా ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని పలు విభాగాలకు చెందిన సిబ్బంది చెబుతున్నారు. మీడియా పాయింట్ ఐఅండ్‌పీఆర్, సెక్రటేరియట్ ఎంట్రీ పాసుల జారీ, విదేశాలకు వెళ్లే వారిని ధృవీకరించే ఈ విభాగాల్లో తీవ్ర అంతరాయం కలగడంతో అధికారులు మాన్యువల్‌గా సచివాలయం పాసులు జారీ చేస్తున్నారు. అంతరాయానికి కేబుల్ వైర్లు తెగిపోవడమే కారణమని తెలుస్తోంది.
సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ఐటీ విభాగం 5 రోజులుగా మరమ్మతులు చేయడం లేదని, పలుసార్లు ఫిర్యాదు చేసినా జీఏడీ GAD (జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్) అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ఏకంగా సచివాలయంలోనే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.






