- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 న ఘనంగా నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 న ఘనంగా నిర్వహించనున్నారు. పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ గా పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత, సామాజిక ఆరోగ్యం, ఐక్యత, ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, అన్ని జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 21 న ఉదయం 6.30 నుండి 7.45 వరకు జరిగే యోగా సంగమ్ అనే దేశవ్యాప్త సామూహిక యోగా ప్రదర్శనలో అన్ని పాఠశాలలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కామన్ యోగా ప్రోటోకాల్ ను పాటించాలని పేర్కొన్నారు.
ఇది 22 భారతీయ భాషలలో అధికారిక ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా(ఐడీవై) పోర్టల్ లో అందుబాటులో ఉంటుందన్నారు. https://yoga.ayush.gov.in/yoga-sangam లింక్ ద్వారా ఐడీవై పోర్టల్‌లో ఆర్గనైజర్‌లుగా నమోదు చేసుకోవాలి. వేడుకల్లో భాగంగా క్యాంపస్‌లో ప్రత్యేక యోగా సెషన్ నిర్వహించాలని పేర్కొన్నారు. బ్రాండింగ్ కిట్, 10 సిగ్నేచర్ ఈవెంట్‌ల వివరాలు https://drive.google.com/drive/u/0/folders/11RmU2gPHnQmixGQvUYPJ1X3Bt1oBliMe వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రవ్యాప్త కార్యక్రమం సంపూర్ణ విద్యతో పాటు సంక్షేమం పట్ల తెలంగాణ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు.






