- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అప్‌డేట్
హాల్ టికెట్ల(Hall Tickets)పై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(TG Intermediate Board) కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: హాల్ టికెట్ల(Hall Tickets)పై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(TG Intermediate Board) కీలక ప్రకటన చేసింది. హాల్ టిక్కెట్లను కళాశాల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి తమ హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు. ఏవైనా తేడాలు ఉంటే, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్(College Principal)లను సంప్రదించాలి అని తెలిపారు. హాల్ టిక్కెట్లు కూడా తగిన సమయంలో విద్యార్థులకు వ్యక్తిగతంగా వాట్సాప్ ద్వారా పంపబడతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.
ఇక తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు(Inter First Year Exams) మార్చి 5 నుంచి, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు/ హాల్ టిక్కెట్‌లను పరీక్షా కేంద్రానికి తీసుకురావడం తప్పనిసరి. ఈ హాల్‌టికెట్లను తీసుకురాకపోతే పరీక్ష హాల్లోకి ఎంటర్ కానివ్వరు. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా తమ హాల్‌టికెట్లను వెంట తీసుకుని రావలెనని సూచించారు.
మరోవైపు తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) 2025 షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.






