రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

by Muthe.Rajitha |

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనికోసం ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్షల్లో విజయం సాధించేందుకు తల్లిదండ్రులు, అధ్యాపకులు వారికి అండగా నిలబడాలి. వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఎగ్జామ్ హాల్ లోనికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ ను రాయాలి. నిపుణుల సలహాలను పాటించాలి.

గ్రేస్ పీరియడ్ సమయం ఉన్న ముందుగానే చేరుకోవాలి

గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఇంటర్మీడియట్ బోర్డు ఒక్క నిముమిషం నిబంధనను సడలిస్తూ ...5 నిమిషాల గ్రేస్ పీరియడ్ సమయం ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే, విద్యార్థులు 5 నిమిషాలు సమయం ఉందని ఆలస్యంగా వెళ్లొద్దు. ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ద్వారా ఎలాంటి భయాందోళనలు ఉండవు. ముందుగా వస్తే రూం నెం. ఎగ్జామ్ సెంటర్ వాతావరణం, ఓ ఎంఆర్ షీట్ వివరాలు పూర్తి చేసేందుకు ఆ సమయం ఉపయోగపడుతుందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు పరీక్ష సమయంలో ఒత్తిళ్లు, భయాలకు గురికాకుండా

ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెం. 040-24600110 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. అదనంగా, ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ద్వారా 9240205555 నంబర్ ద్వారా తక్షణ సహాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఐవీఆర్ కు వచ్చే కాల్స్ సంఖ్యను బట్టి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సైతం ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లను చేసింది. భయం లేకుండా ఎగ్జామ్స్ రాసేందుకు విద్యార్థులకు అన్ని రకాలుగా బోర్డు అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విద్యార్థుల జీవితాల్లో కీలక ఘట్టమైనందున వారు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా ఏర్పాట్లను చేసింది.

Next Story