- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ అవకాశం నాకు లభించింది’.. డిప్యూటీ CM భట్టి ఆసక్తికర ట్వీట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.8.70 కోట్ల వ్యయంతో నిర్మితమైన 33/11 కేవీ. సబ్ స్టేషన్‌లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.8.70 కోట్ల వ్యయంతో నిర్మితమైన 33/11 కేవీ. సబ్ స్టేషన్‌లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రారంభించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా దీనిపై ట్వీట్ పెట్టారు. ‘ఈ సబ్ స్టేషన్‌లు గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన, నిరవధికంగా విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజల ఆశయాలను, అవసరాలను తెలుసుకునే అవకాశం నాకు లభించింది. ప్రజల ఆశీస్సులతో మరింత బలోపేతంగా పని చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాము. ఈ కార్యక్రమంలో సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో ముందు వరుసలో నిలబెట్టే దిశగా ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ట్వీట్






