- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రేవంత్ రెడ్డి సీఎం’.. తెలంగాణ ఫలితాలపై రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
తెలంగాణలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'హాయ్ రాహుల్ గాంధీ జీ, సోనియా గాంధీ జీ.. సుదీర్ఘ

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'హాయ్ రాహుల్ గాంధీ జీ, సోనియా గాంధీ జీ.. సుదీర్ఘ కాలంలో తొలిసారిగా నాకు కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన గౌరవం కలుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్, రేవంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కింగ్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
Next Story






