- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకరినొకరు ‘టైగర్’ అని పిలుచుకున్న తెలంగాణ మంత్రులు
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) మిర్యాలగూడ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) మిర్యాలగూడ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిండు సభలో మంత్రులు ఇద్దరు ఒకరినొకరు టైగర్ అని పిలుచుకున్నారు. ముందుగా నల్లగొండ టైగర్(Tiger) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో జిల్లాలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించగా.. నేను కాదు మీరే టైగర్ అంటూ కోమటిరెడ్డి సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ ఇద్దరు టైగర్లే అని కొనియాడుతుండగా, బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఇక ఆ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలోని 10 సంవత్సరాల కాలంలో కృష్ణానది జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాలలో ఆంధ్రాకు ఎక్కువ నీటి తరలింపు జరిగిందని మండిపడ్డారు. బచావత్ ట్రిబ్యునల్ కమిటీ ద్వారా 811 టీఎంసీలకు గాను గత ప్రభుత్వం తెలంగాణకు కేవలం 218 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునేందుకు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనాభాను, ఆయకట్టు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని 70% నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకునే విధంగా బ్రిజేష్ కుమార్ కమిటీ పున:పరిశీలన చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులలో పూడిక కారణంగా నీటి నిలువ సామర్థ్యం తగ్గిందని అన్నారు.






