- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండలిలో ఆసక్తికర పరిణామం.. ‘కంటి వెలుగు’పై చైర్మన్ గుత్తా ప్రశంసలు
శాసన మండలి సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: శాసన మండలి సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ఆర్ఎంపీ (RMP)లకు, పీఎంపీ (PMP)లకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి ధృవపత్రాలు జారీ చేసే ప్రతిపాదన ఉందా అని బీఆర్ఎస్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు సభలో ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha)కు సమాధానం ఇస్తుండగా, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) కలగుజేసుకుని మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘కంటి వెలుగు’ పథకంలో భాగంగా ఊరూరా క్యాంపులు పెట్టి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారని తెలిపారు. స్పాట్‌లో కంటి పరీక్ష నిర్వహించి, అందుబాటులో ఉన్న వారికి కళ్లజోళ్లు అక్కడే ఇచ్చేశారని, సరిపోయే కళ్లజోళ్లు లేని వారికి టైమ్ ఇచ్చి డైరెక్ట్‌గా ఇంటికే తీసుకెళ్లి ఇచ్చారని తెలిపారు. ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవసరమో వారికి మాత్రం సీరియల్ ప్రకారం కొన్ని కంటి ఆసుపత్రులకు లింక్ చేసి చూపు వచ్చేలా చేశారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో కాంగ్రెస్ సభ్యులకు కాస్త ఇబ్బంది కలిగించాయని తెలుస్తోంది.






