- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. BRS ఎమ్మెల్యేలను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ శాసనసభ ఇవాళ ఇరు పక్షాల వాదనలతో దద్దరిల్లింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ ఇవాళ ఇరు పక్షాల వాదనలతో దద్దరిల్లింది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. మూసీ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిసిన వెంటనే తమకు మాట్లాడేందుకు బీఆర్‌ఎస్ (BRS) సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో వాదనకు దిగారు. అందుకు ఆయన అంగీకరించకోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే, అంతకు ముందు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ (Mahbubnagar) కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ (Yennam Srinivas Reddy) రెడ్డి లాబీలో బీఆర్‌ఎస్ నేతలతో కలిశారు. వారితో పిచ్చిపాటిగా కాసేపు ముచ్చటించారు. ఇది చూసిన మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే యెన్నం.. ఏంటి సార్ విషయం అని ప్రశ్నించారు. అందుకు ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లానంటూ సమాధానమిచ్చారు.






