- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో రేపు మా స్టార్ బ్యాట్స్‌మెన్ నువ్వే! మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
అసెంబ్లీ ఆవరణలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly sessions) ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, (Kaleshwaram) కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం అసెంబ్లీ ఆవరణలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. అసెంబ్లీలో రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టాక సభలో మా స్టార్ బ్యాట్స్‌మెన్ నువ్వే అని కోమటిరెడ్డితో మంత్రి ఉత్తమ్ అన్నారు. లేదు ఈ విషయంలో అయితే నువ్వే మా అందరికి కెప్టెన్ అని ఉత్తమ్‌ని కొమటిరెడ్డి నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య నవ్వులు పూశాయి.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. రేపు అసెంబ్లీకి (KCR) కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపైన కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలి. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో హరీశ్‌రావును, కేటీఆర్‌ను అసెంబ్లీ స్టేషన్‌లో మాట్లాడాలని కేసీఆర్ చెప్తున్నారు. వాళ్లే మాట్లాడిన తర్వాత కేసీఆర్‌కు ఎందుకు ప్రతిపక్ష నాయకుడి హోదా. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీశ్ రావుకు అప్పగించాలి.. అని మంత్రి కోమటిరెడ్డి చిట్‌చాట్‌లో మాట్లాడారు.






