- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా సామాజికవర్గాన్ని అణగదొక్కే శక్తి ఎవరికీ లేదు’.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
కమ్మ సంఘాల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కమ్మ సంఘాల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్(NTR) స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అరెస్టును మొదట ఖండించింది కూడా తానేనని చెప్పారు. కమ్మ సామాజికవర్గాన్ని అణగదొక్కే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం నుంచి కమ్మ కులస్థులు సామాజిక సేవలో అగ్రభాగాన ఉన్నారని అన్నారు. గ్రామాల్లో గుడులు, బడులు ఏర్పాటు చేయించడంలో ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో పేదలను ఆదుకున్నదీ కమ్మ కులస్థులేనని గుర్తుచేశారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.
Next Story






