‘అవన్నీ ఫేక్ న్యూస్‌లు’.. ఖండించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Gantepaka Srikanth |

మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు.

‘అవన్నీ ఫేక్ న్యూస్‌లు’.. ఖండించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ముందున్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని, అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. అమరవీరుల స్థూపం తమకు గుడితో సమానమని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నా అంటే నాతో పాటే కార్యకర్తలు వస్తా అన్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు అయినందున అమరుల స్థూపానికి నివాళులు అర్పించానన్నారు. ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా ఉండాల్సిన సమయం కావున, వరద ప్రాంతాల్లో పర్యటిస్తా.. వారికి అండగా ఉంటానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని మీడియాల్లో తాను మళ్లీ అసెంబ్లీకి రానంటూ వార్తలు ప్రసారం చేస్తున్నారని తాను అలా చివరి రోజు అని ఎక్కడా అనలేదు మాట్లాడలేదని, ఆ వార్తలను ఖండిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు, కొందరు కావాలని కక్ష కడుతున్నారు, రాజీనామా అంటూ వార్తలు రాస్తున్నారు. అవి నమ్మవద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు.

Next Story