- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala: పొలిటీషియన్ విఫలమైతే సమాజమే కూలుతుంది.. ప్రతిపక్షాల పాత్రపై ఈటల కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్షాల పాత్రపై ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ప్రభుత్వాలు ప్రజల క్షేమాన్ని, తన బాధ్యతను మర్చిపోతే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనన్నారు. కానీ ఇవాళ దేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విదేశాల్లో దేశ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని, దేశ ప్రజలను అపహాస్యం చేస్తోందన్నదని విమర్శించారు. ఇవాళ నాచారంలోని ఓ పాఠశాలలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీతో చీకటి అధ్యాయాన్ని రచిస్తే ప్రభుత్వాన్ని నడిపించే సారథి గొప్పగా ఉంటే ఎలా ఉంటుందో ఈ 11 ఏళ్లు మోడీ చూపించారన్నారు. డాక్టర్ విఫలం అయితే మనిషికి మాత్రమే నష్టం జరుగుతుంది, ఓ ఇంజనీర్ విఫలం అయితే ఓ కట్టడం మాత్రమే విఫలం అవుతుంది కానీ ఓ పొలిటీషియన్ సక్రమంగా లేకపోతే సమాజమే కూలిపోయే ఆస్కారం ఉంటుందన్నారు.
పీవీకి నివాళి:
అంతకు ముందు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) 104వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద గల పీవీ ఘాట్ లో ఈటల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీవీ మా హుజూరాబాద్ వాసి అని అంచలంచలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారన్నారు. అప్పట్లో పీవీ గురించి కథలు కథలుగా చెప్పుకునే వారని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దళంలో పనిచేసిన వ్యక్తి ఆయన అన్నారు. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆణిముత్యాల్లాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేశారని గుర్తు చేశారు. కేంద్రంలో హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది కూడా పీవీనే అని విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మహోన్నతంగా నిలబెట్టిన వ్యక్తి అని కొనియాడారు. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో లిబరైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకువచ్చి దేశ ఆర్ధిక వ్యవస్థ దారిలో పెట్టారన్నారు. ఆయన జీవితం రాజకీయ వ్యవస్థకు, నాయకులకు గొప్ప సందేశం అని చెప్పారు.






