ఆయన లేని దేశాన్ని ఊహించుకోలేం: డిప్యూటీ CM భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఆయన లేని దేశాన్ని ఊహించుకోలేం: డిప్యూటీ CM భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆయన లేని దేశాన్ని ఊహించుకోలేం: డిప్యూటీ CM భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. శనివారం విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో దివంగత ప్రధాని నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలెబ్రేషన్స్‌లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధాని కావడంతో సైన్స్‌లోనే కాకుండా ప్రజాస్వామ్యంలోనూ ప్రపంచంతో పోటీ పడుతున్నామని అన్నారు. తొలి ప్రధానిగా నెహ్రూ లేకపోతే దేశ పరిస్థితిని ఊహించుకోలేమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతితోనే దేశం బలోపేతమవుతుందని అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తొలి ప్రధాని కాకపోయిఉంటే దేశం దయనీయ స్థితిలో ఉండేదన్నారు. స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత ఆర్థికంగాను.. ఆహార, విద్యాపరంగాను పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయని గ్రహించిన నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి.. సమాజానికి అవసరమైన మిశ్రమ ఆర్థిక విధానాలు అమలు చేశారని కొనియాడారు.

Next Story