- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RS Praveen Kumar: ఖద్దర్, ఖాకీ.. రెండూ నాకు బాగానే ఉన్నాయి
రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్(BRS) కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్(BRS) కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ఖద్దర్, ఖాకీ.. రెండూ తనకు బాగానే ఉన్నాయని అన్నారు. కానీ నాకింకా రాజకీయ అవలక్షణాలు రాలేదని చెప్పారు. అంతేకాదు.. తాను ఇంకా పూర్తి రాజకీయ నేతగా పరివర్తన చెందలేదు అని కూడా అన్నారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ తనది బహుజన వాదమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ద్వారా బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేస్తానని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. బీఆర్ఎస్‌కు, బహుజన నినాదానికి మూలం అణిచివేతే అని వెల్లడించారు. తాను బందీని కాదు.. విముక్తిడిని అయ్యానని అన్నారు. బీఆర్ఎస్‌లో తనకు కేసీఆర్(KCR) పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. బీఎస్పీలో కంటే తనకు బీఆర్ఎస్‌లోనే ఎక్కువ స్వేచ్ఛగా మాట్లాడగలుతున్నానని అన్నారు. నాపై ఎవరూ పెత్తనం చేయడం లేదు. నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటకు ఇంకా కట్టుబడే ఉన్నాను. బహుజన రాజ్యం రావాలంటే దళితుడే సీఎం కావాలని నేను ఏనాడూ అనలేదు. నేను ఏ పార్టీలో ఉన్నా కరెక్ట్ డైరెక్షన్‌లోనే ముందుకు వెళతా. చివరి శ్వాస వరకు బహుజనుల కోసమే పోరాటం చేస్తా’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు.






