- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్ని క్లూస్ ఇచ్చాం.. ఇక మీరేం చేస్తారో కూడా చూస్తాం: KTR ఆసక్తికర వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల్లో(HCU Lands) పర్యావరణ విధ్వంసమే కాదు.. రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: హెచ్‌సీయూ భూముల్లో(HCU Lands) పర్యావరణ విధ్వంసమే కాదు.. రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ఈ భూ కుంభకోణం కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నే అన్నారు. అంతేకాదు.. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ(BJP) పాత్ర ఉందని.. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ కుమ్మక్కు అయిందని భావించాల్సి వస్తుందని అన్నారు. అంతేకారు.. కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కోర్టుకు పోతామని కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిని ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. మిత్రపక్షాల ద్వారా లోక్ సభ, రాజ్యసభల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు. నిన్న వచ్చిన అపెక్స్ కమిటీ పర్యావరణ విధ్వంసంపై విచారణ జరిపింది. అందుకే ఈ ఆర్థిక మోసంపై తాము ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.
‘పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు కానీ ఇప్పటిదాకా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమృత్ స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల రూపాయలు దారి మళ్లించాడని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేదు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడి దాడులు జరిగితే ఇప్పటిదాకా అధికార ప్రకటన రాలేదు. ఈ వ్యవహారాన్ని ఈ ఆర్థిక మోసాన్ని కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటారో లేదంటే నిజంగానే సమగ్ర విచారణకు ఆదేశించి మేము నిజాయితీగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ దోపిడీని ఉపేక్షించమని కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి’ అని కేటీఆర్ హితవు పలికారు.
ఈ దేశంలో సామాన్యుడు బ్యాంకు లోన్ తీసుకోవాలంటే 100 డాక్యుమెంట్స్‌ను వెరిఫై చేసి 100 కొర్రీలు పెట్టి లోన్ ఇస్తారు. అదే ఒక సంపన్నుడు అధికారపక్షంతో అనుబంధం ఉన్నవాడు లోన్ అడిగితే నిమిషాల్లోనే మంజూరు చేస్తారు. కనీసం భూమి ఉందో లేదో కూడా చెక్ చేయరు ఇక్కడ కూడా అదే జరిగింది. ఐసీఐసీఐ లాంటి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు, భూయాజమాన్య హక్కును పరిశీలించకుండానే ఆ భూమి ఎవరిదో తెలుసుకోకుండానే పదివేల కోట్లు లోన్ ఇవ్వడం ఆశ్చర్యం. ఇన్ని క్లూస్ ఇచ్చాక జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కేటీఆర్ అన్నారు.






