- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాంచందర్ రావు నాయకత్వంలో మా సత్తా ఏంటో చూపిస్తాం: MP లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు(Ramchander Rao) బాధ్యతలు స్వీకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు(Ramchander Rao) బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మన్నెగూడలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్(MP Lakshman) మాట్లాడుతూ.. రాంచందర్ రావు ఆర్ఎస్ఎస్‌లో శిక్షణ పొంది, విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో నాయకత్వం వహిస్తూ, బీజేపీలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ నిజమైన కార్యకర్త. ఇది ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావించాలని అన్నారు. బీజేపీలో నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం నిరంతరం కష్టపడిన నాయకులకే పెద్ద పదవులు లభిస్తాయి. దానికి రాంచందర్ రావు మరో ఉదాహరణ అని అన్నారు.
రాంచందర్ రావు సీనియర్ అడ్వకేట్. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అనేక కేసులు వాదించారు. జాతీయ స్థాయిలో బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా కూడా పనిచేశారు. తాను రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 200 ఓట్ల తేడాతో ఓడినప్పుడు, ఎంతోమంది ఎన్నికల పిటిషన్ వేయమన్నారు. అప్పుడు నేను ఆ బాధ్యతను రాంచందర్ రావుకే అప్పగించాను. చాలామంది అడ్వకేట్లు ఆశ్చర్యపడ్డారు.. రాంచందర్ రావు క్రిమినల్ లాయర్, మరి సివిల్ పిటిషన్ ఎలా వాదిస్తారని.. కానీ రాంచందర్ రావు వాదించి చూపించారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో రాంచందర్ రావు నాయకత్వంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక నుంచి తామేంటో, తమ పార్టీ సత్తా ఏంటో రాబోయే ప్రతీ ఎన్నికల్లో చూపిస్తామని లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాంచందర్ రావు నాయకత్వంలో అందరం కలిసి పని చేయాలి. భగవంతుడు ఆయన్ను ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో మనమంతా ఆయనకు అందరం అండగా నిలబడుతామని లక్ష్మణ్ అన్నారు.






