- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti: రాజీవ్ యువ వికాసానికి బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలి: భట్టి విక్రమార్క
రాష్ట్ర స్థాయి బ్యాంక్ల సమితి సమావేశంలో భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: జూన్ 2వ తేదీన ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం (Rajeev yuva Vikasam) పథకం మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయంలోగా చేరుకోవడానికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కోరారు. ఇవాళ హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో మాట్లాడిన ఆయన 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చిందని ఈ పథకానికి రూ.6,250 కోట్లు సబ్సిడీ రూపంలో ఇవ్వబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి రాష్ట్ర జీడీపీ పెరిగే విధంగా ఈ పథకం రూపకల్పన చేశామన్నారు.
సమన్వయానికి నోడల్ అధికారులు:
అన్ని బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం చేసి రాజీవ్ యువ వికాస పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో ఉద్యానవన పంటలకు పెద్దపీట వేస్తున్నది. ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రూ.21 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేశామని రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. రైతు బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తున్నదని చెప్పారు. అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచడానికి ఇందిర సౌర గిరి జల వికాస పథకం తీసుకువచ్చాం రూ.12,600 కోట్లతో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న ఆరు లక్షల 70 వేల ఎకరాలను సౌర విద్యుత్తు ద్వారా సాగులోకి తీసుకువచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు.
వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు:
రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళుతున్నదని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమల్లో పనిచేయడానికి కావలసిన ట్రైనింగ్ ఇందులో ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వం మూసీ పునర్జీవం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య వివిధ క్లస్టర్లతో పారిశ్రామికీకరణ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు.






