హెచ్-1 బీ వీసా ఫీజుపై రూమర్స్.. రేపు ప్రజాభవన్‌లో H1B వీసా ఇంటరాక్షన్ సెషన్..

by Ramesh Naini |   (  Updated:2025-09-26 13:30:16  IST  )

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో H1B వీసాపై ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించనున్నారు.

హెచ్-1 బీ వీసా ఫీజుపై రూమర్స్.. రేపు ప్రజాభవన్‌లో H1B వీసా ఇంటరాక్షన్ సెషన్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రభుత్వం హెచ్-1 బీ వీసా ఫీజులను 100,000 డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో యువతలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గందరగోళాన్ని నివృత్తి చేసేందుకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో H1B వీసాపై ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ H1B వీసా ఇంటరాక్షన్ సెషన్ ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు పంజాగుట్టలోని (Praja Bhavan) ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో H1B వీసా ఫీజు పెంపు, తాజా రూమర్స్, అమెరికా కోర్ట్ ఆర్డర్స్ వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. అమెరికా సెనేటర్లతో జరిగిన సంభాషణల వివరాలు కూడా ఇందులో భాగంగా తెలియజేయనున్నారు.

డాక్టర్ చిన్నా రెడ్డి (వైస్ చైర్మన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం & ప్రజావాణి ఇన్‌ఛార్జ్), దివ్య దేవరాజన్ IAS (స్టేట్ నోడల్ ఆఫీసర్ ప్రజావాణి), అలాగే అమెరికా నుంచి ప్రసిద్ధ ఇమ్మిగ్రేషన్ లాయర్లు జోష్ డాల్రింపుల్, సంతోష్ సోమిరెడ్డి, జానెతా పాల్గొననున్నారు. అదేవిధంగా నాగిరెడ్డి (కమిషనర్, వర్జీనియా స్టేట్ సెన్సస్) కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రవాసి ప్రజావాణి స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జా అమరేందర్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. అలాగే VC చైర్మన్ భీమ్ రెడ్డి, NRI అడ్వైజరీ కమిటీ, IFS చైర్మన్ వినోద్ కుమార్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యమివ్వనున్నారు.

Next Story