TG News : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు

by Muthe.Rajitha |

ఇంటర్ విద్యార్థుల(Inter Students)కు భారీ ఊరటనిచ్చింది తెలంగాణ సర్కార్.

TG News : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్ విద్యార్థుల(Inter Students)కు భారీ ఊరటనిచ్చింది తెలంగాణ సర్కార్. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు(Inter Supplementary Exam Fee) గడువు పెంచుతున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు(TSBIE) ప్రకటించింది. ఈ గడువును మే 14 వరకు రూ.2500 లేట్ ఫీజుతో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. కాగా ఇదివరకే రూ.1000 ఆలస్య రుసుముతో మే 8 వరకు పెంచగా.. ఈ గడువును మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మే 22 నుంచి 29 వరకు జరగనున్నాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్

మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -1

మే 23 – ఇంగ్లీష్ పేప‌ర్ -1

మే 24 – మ్యాథ్స్ పేప‌ర్ 1ఏ, బోట‌ని పేప‌ర్ -1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -1

మే 25 – మ్యాథ్స్ పేప‌ర్ 1బీ, జువాల‌జీ పేప‌ర్ -1, హిస్టరీ పేప‌ర్ -1

మే 26 – ఫిజిక్స్ పేప‌ర్ -1, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -1

మే 27 – కెమిస్ట్రీ పేప‌ర్ -1, కామ‌ర్స్ పేప‌ర్ -1

మే 28 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -1

మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1, జియోగ్రఫీ పేప‌ర్ -1

ఇంటర్ సెకండియర్ టైం టేబుల్

మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

మే 23 – ఇంగ్లీష్ పేప‌ర్ -2

మే 24 – మ్యాథ్స్ పేప‌ర్ 2ఏ, బోట‌ని పేప‌ర్ -2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -2

మే 25 – మ్యాథ్స్ పేప‌ర్ 2బీ, జువాల‌జీ పేప‌ర్ -2, హిస్ట‌రీ పేప‌ర్ -2

మే 26 – ఫిజిక్స్ పేప‌ర్ -2, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -2

మే 27 – కెమిస్ట్రీ పేప‌ర్ -2, కామ‌ర్స్ పేప‌ర్ -2

మే 28 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -2

మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2, జియోగ్రఫీ పేప‌ర్ -2

Next Story