Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం

by Ramesh Naini |   (  Updated:2025-01-21 10:09:04  IST  )

సికింద్రాబాద్‌లో రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో/చిన్నకోడూరు: (Inter student commits suicide) సికింద్రాబాద్‌ పరిధిలో రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం (Jamia Osmania railway station) జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే లోకో పైలట్ సమాచారం మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story