- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
INTER EXAMS: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఇక వాట్సాప్‌కే హాల్ టికెట్లు
తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల హాల్ టికెట్లను తల్లి దండ్రుల వాట్సాప్ అకౌంట్లకు పంపించనున్నట్టు స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల హాల్ టికెట్లను తల్లి దండ్రుల వాట్సాప్ అకౌంట్లకు పంపించనున్నట్టు స్పష్టం చేసింది. దీనివల్ల హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు పడితే త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని వెల్లడించింది. పరీక్షకు అప్లై చేసిన సమయంలో ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కే హాల్ టికెట్ లింక్ పంపిస్తామని ఆ లింక్ ఓపెన్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ పదవతరగతి హల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
రెంవసంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. సెకండ్ ఇయర్ విద్యార్థుల తల్లిదండ్రలకు పంపే లింక్‌లో ఫస్ట్ ఇయర్ లో విద్యార్థి సాధించిన మార్కుల వివరాలు,ఫెయిల్ అయిన సబ్జెక్టుల వివరాలు సైతం ఉంటాయని తెలిపింది. దీనివల్ల విద్యార్థి ఎలా చదువుతున్నాడనేది తల్లిదండ్రులకు తెలుస్తుందని పేర్కొంది. తల్లిదండ్రులు హాల్ టికెట్ లోని పేరు, ఫోటో, హాల్ టికెట్ నంబర్, మీడియం తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేవో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపింది. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది.






