TG: ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ నిలిపివేత

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియలో గందరగోళం నెలకొంది.

TG: ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ నిలిపివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి సోమవారం ప్రకటించిన అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ బోర్డు కార్యదర్శి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం, ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కొన్ని కీలక సంస్కరణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదిత సంస్కరణల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కోఆపరేటివ్, గురుకుల, మోడల్ స్కూల్, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అడ్మిషన్లకు సంబంధించిన సవరించిన నూతన మార్గదర్శకాలను,షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని బోర్డు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు అందరికీ సమాచారం అందించినట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తదుపరి ఆదేశాల వరకు వేచి చూడాలని సూచించారు.

Next Story